వావ్.. మరో రీమేక్ లో నటించబోతున్న పవర్ స్టార్...!
ఈ ఏడాది లో విడుదలైన 'వకీల్ సాబ్' సూపర్ హిట్ అందుకుందని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే మరో రీమేక్ చిత్రంతో అలరించనున్నారట పవర్ స్టార్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీమేక్ చిత్రం 'భీమ్లా నాయక్ అని అందరికి తెలుసు.'. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే తాజాగా పవన్ హీరోగా మరో రీమేక్ ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయని తెలుస్తుంది .
తమిళ చిత్రం 'వినోదియ సిత్తం' ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ హీరోగా నటించనున్నాడని సమాచారం.. తెలుగులో క్రాక్మరియు అలా వైకుంఠపురములో చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిదని తెలుస్తుంది.. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషంగా చెప్పుకోవాలట.. గతంలో కొన్ని హిట్ సినిమాలను తెరకెక్కించిన సముద్రఖని కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. మళ్లీ మెగా ఫోన్ రావడంతో కాస్త గ్యాప్ తర్వాత తనే హీరోగా నటించిన 'వినోదియ సిత్తం' సినిమాను పవర్ స్టార్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కథ అంశానికి వస్తే ఓ నడి వయస్కుడైన వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోయాక మూడు నెలల పాటు బతికే అవకాశం పొందుతాడట. ఆ మూడు నెలల్లో తన కోరికలను ఎలా నెరవేర్చుకున్నాడట.ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలను కుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయట. ఈ చిత్రాన్ని సముద్రఖనినే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా ఓకే అయితే పవర్ స్టార్ నటిస్తున్న 11వ రీమేక్ సినిమాగా నిలుస్తుందని సమాచారం.