పుష్ప : సునీల్ విలనిజం.. కామెడీ అయ్యిందా..?
అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆడియెన్స్ తోనే అన్నమాట. కామెడీ చేసే సునీల్ విలన్ గా చేయడం ఏంటని ముందే ఓ నెగటివ్ థాట్ తో ఉన్నారు. పోనీ సుకుమార్ సునీల్ ను ఏమన్నా బీభత్సమైన విలన్ గా చూపించాడా అంటే ఎంట్రీ బిల్డప్ బాగానే ఇచ్చినా పాత్ర స్వభావం పెద్దగా పండలేదని అనొచ్చు. సునీల్ తన వరకు పూర్తి న్యాయం చేసినా సరే అతను విలనిజాన్ని తెలుగు ఆడియెన్స్ కామెడీగా అనుకుంటున్నారు. ముఖ్యంగా చివర్లో సాండల్ వుడ్ సిండికేట్ లీడర్ గా పుష్ప రాజ్ ని చేసినప్పుడు.. తన బావమరిది శవం ఉన్న పెట్టే మీదే తను ఉన్నాడని తెలిసినప్పుడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అతన్ని విలన్ గా కన్నా కమెడియన్ గా చూపించాయని అనిపిస్తుంది.
అందుకే సుకుమార్ సునీల్ లో మంగళం శ్రీను పాత్రని చూసినా ఆడియెన్స్ మాత్రం సునీల్ విలనిజం లో కామెడీ వెతుకున్నారు. ఇంతకుముందు కలర్ ఫోటో సినిమాలో కూడా సునీల్ విలన్ గా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఆ కథను సునీల్ విలన్ గా పర్ఫెక్ట్ అనిపించాడు. అయితే పుష్ప లాంటి సినిమాకు మాత్రం కమెడియన్ కం హీరో సునీల్ విలన్ గా తీసుకుని సుకుమార్ రాంగ్ డెశిషన్ తీసుకున్నాడని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. నేడు రిలీజైన పుష్ప యావరేజ్ టాక్ ఉన్నా సినిమా వసూళ్లు మాత్రం జోష్ ఫుక్ గా ఉన్నాయని తెలుస్తుంది.