పుష్ప : నైజాం లో నెవర్ బిఫోర్ రికార్డ్..!
దీనికితోడుగా నైజాం లో ఐదు షోలు పర్మిషన్ ఇవ్వడం సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చింది. అందుకే నైజాం లో తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమా చేయని విధంగా పుష్ప రికార్డ్ వసూళ్లను రాబట్టింది. నైజాం లో ఉదయం 6 గంటల నుండే షోస్ వేయడం వల్ల ముందుగా అనుకున్న 4 షోస్ కు వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్ ఫిల్ అయ్యాయి. ఇక సినీ లవర్స్ కు పండుగ జరుపుకునేలా చేశాయి.
నైజాం లో పుష్ప సినిమా 11.44 కోట్ల కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. బాహుబలి 1, 2 కలక్షన్స్ సైతం దాటి పుష్ప సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. మెగా హీరోగా ఇన్నాళ్లు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఎదిగిన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా సౌత్ సూపర్ హీరోల సరసన చేరాడు. తన స్టామినా ఏంటి అన్నది పుష్ప ద్వారా చూపించాడు అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఫస్ట్ డే వసూళ్లు అదరగొడుతుండగా సినిమా అనుకున్న రేంజ్ లో భారీ వసూళ్లు సాధిస్తుందా లేదా అన్నది తెలియాలంటే వీకెండ్ కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా పుష్ప వసూళ్లతో మాత్రం రీకర్డులను క్రియేట్ చేస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు భారీ రేంజ్ లో ఉన్నాయి.