20 రోజుల ముందే రికార్డులు.. యూఎస్ లో RRR బీభత్సం..!
బాహుబలితో నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేసిన జక్కన్న. rrr తో అంతకుమించి అనిపించేలా రికార్డులపై గురి పెట్టారు. అందుకే యూఎస్ లో rrr సినిమాను భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరి హీరోలకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉండటంతో 198 లొకేషన్స్ లో rrr రిలీజ్ అవుతుంది. ఇక 20 రోజుల ముందే ఈ సినిమాకు సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రాజమౌళి సినిమా ఎలాగైనా చూడాలనే ఫ్యాన్స్ 20 రోజుల ముందు నుండి టికెట్స్ కొనేస్తున్నారు.
ఇప్పటికే అక్కడ జరిగిన ప్రీ సేల్స్ ప్రకారం 13,700 టికెట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది. వాటి మొత్తంగా 380000 డాలర్లు వచ్చాయట. ప్రీ సేల్స్ తోనే యూఎస్ లో ఆర్.ఆర్.ఆర్ దూకుడు ఏంటన్నది అర్ధమవుతుంది. ఇక బయట మార్కెట్ లోనే అలా ఉంటే ఇండియాలో ఆర్.ఆర్.ఆర్ హడావిడి ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. రాజమౌళి బ్రాండ్ కు తగినట్టుగానే ఆర్.ఆర్.ఆర్ మళ్లీ మరో సంచలన సినిమా.. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అవుతుందని ఫిక్స్ అవ్వొచ్చు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ కనిపించనున్నారు. సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై నేషనల్ లెవల్ లో సూపర్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా వసూళ్లు కూడా తప్పకుండా రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంటాయని చెప్పొచ్చు.