పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!
అల్లు అర్జున్ తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్ల ఇదంతా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. దాదాపుగా నాన్ బాహుబలి రికార్డులను సైతం కొట్టిపారేసినట్లుగా తెలుస్తోంది. కానీ సొంత భాషలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేక పోతోంది ఈ సినిమా. ఇందులో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ ఇలా ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా సినిమా హైప్ ను పెంచలేక పోయారు. కొంత మంది స్టార్ హీరోలు కూడా ఈ సినిమా స్టోరీ విని రిజెక్ట్ చేసినట్లుగా కూడా సమాచారం.
ఇకపోతే ఈ సినిమా మీద అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రెండు సంవత్సరాలుగా ఎన్నో అంచనాలను పెట్టుకున్నప్పటికీ.. సుకుమార్ మాత్రం ప్రేక్షకులు అంచనాలను నెరవేర్చలేక పోయాడు. అంతేకాదు అల్లు అర్జున్ లాంటి ఐకాన్ స్టార్ ను ఇలా చూపించడం వల్లే అక్కడ ఆయన బోల్తా కొట్టాడు అని చెప్పవచ్చు. ఆర్య సినిమా లో ఒక్కటే వీరిద్దరి కాంబినేషన్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆర్య టు సినిమా కూడా అల్లు అర్జున్ స్టైల్ ప్రేక్షకులకు నచ్చక యావరేజ్ గా నిలిచింది. దీంతో పుష్ప టు కూడా ఏమవుతుందో అని చెప్పలేము అన్నట్లుగా సమాచారం