అప్పుడు వదిలేసా..ఇప్పుడు అస్సలు వదలను..నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇలా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని..నాని నుండి నేచురల్ స్టార్ నాని అని అభిమానుల దగ్గర పిలిపించుకున్నాడు ఈ హీరో. నాని ఇండస్ట్రీకి రావడం రావడమే హీరో అయిపోలేదు..మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా..ఆ తరువాత చిన్న సినిమాలతో మొదలు పెట్టి..ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్ లేని ఈ హీరో ఒక్కప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
రీసెంట్ గా నాని హీరోగా నటించిన చిత్రం "శ్యామ్ సింగరాయ్". టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించడంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా క్రిస్మస్ సంధర్భంగా ఈ నెల 24 న గ్రాండ్ గా ధియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యుల్లో నాని మాట్లాడుతూ ఆయన సినిమాల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
శ్యామ్ సింగరాయ్ సినిమాకోసం నాని లావు అయ్యాడు అని వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఆయన ఈ విషయం పై స్పందిస్తూ.."అలాంటిది ఏం లేదు. నేను గడ్డం తీసేసాను గా..అందుకే మీకు అలా కనిపించిన్నట్లు ఉన్నాను" అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మీ ఫేవరెట్ దర్శకుడు మణిరత్నం తో సినిమా ఎప్పుడు అని అడగ్గా.." గతంలో ఓసారి అవకాశం వచ్చింది. అప్పుడు మిస్ చేసుకున్న. కానీ ఈసారి మాత్రం వదలను. ఖచ్చితంగా ఆఫర్ వస్తే ఆయనతో సినిమా చేస్తా" అంటూ చెప్పుకొచ్చారు నాని.