ఏంటి? 'మగధీర' మొదటి హీరో బాలయ్యనా!

Purushottham Vinay
'మగధీర' సినిమా అనగానే మనకు మొదట రామ్‌చరణ్‌ లుక్‌, హీరోయిజం… రాజమౌళి టేకింగ్‌, ఎలివేషన్లు ఇంకా భారీతనం గుర్తొస్తాయి. అయితే మగధీర సినిమాకి మొదటి హీరో రామ్‌చరణ్‌ కాదట. నందమూరి నటసింహం బాల కృష్ణ అట.అవును అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అప్పుడు బాల కృష్ణ కాలభైరవగా కనిపించేవాడు. ఈ మాట ఎవరో చెప్ప లేదు…ఏకంగా సినిమా డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళినే చెప్పారు. 'మగధీర' సినిమా కథను మొదట విన్నది బాలయ్యేనట. ఈ విషయం గురించి మనకి పూర్తి వివరాలు చెప్పకపోయినా కాని ఆయన జస్ట్ హింట్‌ ఇచ్చి వదిలేశారు.'ఆహా' లో బాల కృష్ణ హోస్ట్‌గా ప్రసారమవుతునర్న 'అన్‌స్టాపబుల్‌' షోకి దర్శక ధీరుడు రాజమౌళి ఇంకా ఆయన అన్న మరకతమణి కీరవాణి వచ్చారు. ఈ సందర్భంగా సినిమాలు ఇంకా అలాగే ఇతర విషయాలు గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలయ్యను మొదటిసారి రాజమౌళి ఎప్పుడు కలిశారు అనే విషయంలో చర్చ వచ్చింది. అప్పుడే ఈ 'మగధీర' సినిమా కథ విషయం బయటకు వచ్చింది.


'ఛత్రపతి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్యను రాజమౌళి కలిశారట. అప్పుడు 'మగధీర' సినిమా కథను బాలయ్యకు చెప్పడం జరిగిందట . అయితే తరువాత ఇక ఏమైందేమో తెలియదు కానీ… ఆ సినిమా మాత్రం అప్పుడు వర్కవుట్‌ కాలేదు.ఎందుకు వర్క్ ఔట్ కాలేదనే విషయం తెలియదు కానీ… ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు రామ్‌చరణ్‌కు రాజమౌళి ఆ సినిమా కథ చెప్పడం, తరువాత సినిమా తీయడం ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్లిందో అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ సినిమాను అప్పుడు బాలకృష్ణ ఎ ఎందుకు ఓకే చెయ్యలేదు అనేది మాత్రం అసలు తెలియడం లేదు. ఒకవేళ బాలకృష్ణ చేసి ఉంటే… ఎలా ఉండేదో ఒకసారి మీరే ఊహించుకోండి. బాలయ్య రేంజిలో అదిరిపోయేదేమో కదా. ఇక 'మగధీర' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్ జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో శ్రీహరి కూడా మంచి కీలక పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: