వావ్ వావ్ : ఆ విషయంలో తండ్రినే మించి పోయాడు చెర్రీ?
సినీ ఇండస్ట్రీలోని ఉన్నతమైన కుటుంబంలో నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి ఇమేజ్ ను సాధించారు. ఇక రామ్ చరణ్ భార్య అపోలో సంస్థ కు మనవరాలు కావడం గమనార్హం. అలా ఉపాసన బాగా ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నారు మెగా కుమారుడు. ఇక తన అత్తమామల నుంచి భారీగానే కట్నకానుకలు పొందినట్లు సమాచారం రామ్ చరణ్. ఇలా ఒక వైపు హీరోగా, మరొకవైపు ప్రొడ్యూసర్ గా.. తన సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. అలా బాగానే ఆస్తులను వెనకే చేసినట్లుగా తెలుస్తోంది. రామ్చరణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే.. ఈ ఏడాది వరకు 1550 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినట్లు గా సమాచారం. ఇక అతి తక్కువ సమయంలోనే ఇన్ని కోట్లు సంపాదించడం అంటే అది ఆషామాషీ అయిన విషయం కాదని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఆచార్య మూవీ కు ప్రొడ్యూసర్ గా..RRR మూవీలో హీరోగా నటిస్తున్నారు రామ్ చరణ్. ఇలా ఎన్నో ఉన్న సినిమాలు చేసుకుంటూ పోవడం వల్ల.. ఈయన ఆస్తి ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తను నటించిన సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తన 15వ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.