పుష్ప సినిమాతో తన ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో సాటిస్ ఫై చేసిన అల్లు అర్జున్.. మంచి రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. బన్నీ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ మూవీపై ఫస్ట్ నుంచి పెంచుకున్న అంచనాలకు తగ్గట్టు..ఊహించని విధంగా రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్మురేపుతోంది పుష్ప ది రైజ్. 2021వ సంవత్సరంలో సాలిడ్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది పుష్ప. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ నంబర్ వన్ పొజిషన్ లో కూర్చున్నాడు అల్లు అర్జున్.బాల కృష్ణ అఖండ, అక్షయ్ కుమార్ సూర్యవంశీ, విజయ్ మాస్టర్, రజని కాంత్ అన్నాత్తే.. ఆఖరికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసి 63కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ సృష్టించాడు ఐకాన్ స్టార్. ఇక అంతేకాదు మన నైజాం ఏరియాలో పదకొండున్నర కోట్ల వసూళ్లతో టాప్ 1 ప్లేస్ కి చేరింది ఈ పుష్ప. ఇప్పటి దాకా కూడా ఫస్ట్ నాలుగు స్థానాల్లో ఉన్న సాహో, బాహుబలి2, వకీల్ సాబ్, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఈ సినిమా లెక్కలతో వెనకపడ్డాయి.
టోటల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అలాగే తెలంగాణ కలెక్షన్స్ దాదాపు 25 కోట్లను క్రాస్ చేసింది. ఏపీలో టికెట్ రేట్ పెంచి ఉంచడం వలన లెక్క వేరే ఉండేదనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.ఇక కర్ణాటక ఇంకా తమిళనాడులో కూడా బాగానే వసూళ్లు రాబట్టింది పుష్ప సినిమా. ఇక బాలీవుడ్ లో కూడా పెద్దగా ఏమి హైప్ క్రియేట్ చేయకుండానే మంచి డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. బాగా రన్ అవుతుంది.అక్కడ ఫస్ట్ డే వచ్చేసి 3 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది పుష్ప. అటు యూఎస్ లో కూడా ప్రీమియర్స్ ఇంకా డే1 రాబడిని కలుపుకుంటే ఆరున్నర కోట్లకు పైమాటే వసూలు చేసింది. ఇలా పుష్ప సినిమా మేనియాతో అక్కడ, ఇక్కడ అని లేకుండా అన్ని చోట్ల ప్రూవ్ చేసుకుంటు తగ్గేదేలె అంటూ దూసుకుపోతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.ఇక చూడాలి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో ఇంకా ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తాడో..