సుక్కు.. పుష్ప విషయంలో లాజిక్ మిస్ అయ్యాడా?

Purushottham Vinay
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాను కనుక పరిశీలిస్తే ఆ జాబితాలో ముందువరసలో కచ్చితంగా ఉండే డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరని చెప్పాలి. సినిమాల్లోకి రాకముందు లెక్కల టీచర్ గా పని చేసిన సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన ఆర్య సినిమాతో టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు యువతను కూడా ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఆర్య సినిమాను ఇష్టపడతారు.అప్పుడు నిర్మాత దిల్ రాజుకు ఆర్య సినిమా భారీ లాభాలను అందించడం జరిగింది.అయితే రామ్ తో సుకుమార్ చేసిన రెండో సినిమా జగడం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమాలోని పాటలు హిట్టైనా కాని సుకుమార్ కు సక్సెస్ సొంతం కాలేదు. ఆ తర్వాత ఆర్య సినిమాలోని పాత్రల స్పూర్తితో సుకుమార్ మళ్ళీ అర్జున్ తో ఆర్య2 సినిమాను తెరకెక్కించారు.


భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా కాని హిట్ మాత్రం కాలేదు.ఇక ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో లవర్ బాయ్ నాగ చైతన్యతో 100% లవ్ సినిమాను తెరకెక్కించి సుకుమార్ మంచి అందుకున్నారు. అయితే 1 నేనొక్కడినే సినిమాతో మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు ఈ సినిమాతో మరో ఫ్లాప్ సుకుమార్ ఖాతాలో చేరింది. అయితే ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలతో సుకుమార్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్నారు.కాని వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడంలో మాత్రం సుకుమార్ ఫెయిల్ అవుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పుష్ప సినిమా విషయంలో సుకుమార్ లాజిక్ మిస్ అయ్యి రొటీన్ కథను ఎంచుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సినిమా కథ ఇంకా కథనంలో కొత్తదనం చూపిన సుకుమార్ రంగస్థలం సినిమాని కొన్ని విషయాల్లో ఫాలో కావడం పుష్పకు పెద్ద మైనస్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: