పుష్ప : పార్ట్ 2 అలా ఫిక్సైన నిర్మాతలు..!
ముఖ్యంగా సినిమ రిలీజ్ విషయంలో అసలు హడావిడి చేయమని అన్నారు. పుష్ప పార్ట్ 2 మార్చ్ లో మొదలయ్యే అవకాశం ఉంది. సినిమా మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొత్తం అయ్యాక రెండు నెలలు గ్యాప్ తీసుకుని మరి సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ విషయంలో సుకుమార్ చివరి నిమిషం వరకు సినిమా ఫైనల్ మిక్సింగ్ చేయకుండా ఉన్నాడు. అనుకున్న విధంగా డిసెంబర్ 17న రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో అలా చేయాల్సి వచ్చింది.
పార్ట్ 2 విషయంలో మాత్రం ఇలాంటివి అస్సలు జరగకుండా చూసుకుంటామని చెబుతున్నారు నిర్మాతలు. పుష్ప పార్ట్ 1 DI విషయంలో కూడా తేడా కొట్టేసిందని చెప్పుకుంటున్నారు. ఈ టెక్నికల్ ఫ్లాస్ అన్ని సెకండ్ పార్ట్ లో రిపీట్ అవకుండా జాగ్రత్తగా ముందే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటామని నిర్మాతలు వివరణ ఇచ్చారు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. అయితే సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది అనిపించినా లెంగ్త్, సౌండ్ మిక్సింగ్, కలరింగ్ విషయాల్లో తేడా కొట్టింది. అందుకే ఈసారి అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాకే రిలీజ్ చేస్తామని నిర్మాతలు క్లారిటీ గా చెప్పేశారు.