గత మూడు నెలలుగా కొనసాగుతున్నది ఫేమస్ బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. విజేత ఎవరు తెలిసే రోజు రానే వచ్చింది. దీంతో దేశంలోని ప్రజలంతా ఆ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ఈరోజుతో ఈ షోకు పుల్ స్టాప్ పడనుంది. అయితే బయట వస్తున్న ఊహాగానాల ప్రకారం శనివారం రోజునే గ్రాండ్ ఫినాలేకి సంబంధించి షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, హీరో నాని, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రెండో సీజన్కు హోస్ట్ గా వ్యవహరించిన నాని, ఈ యొక్క ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే కు హోస్ట్ గా వ్యవహరించారని తెలుస్తోంది.
గత సీజన్లో జరిగింది దాని కంటే ఎక్కువ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. స్టేజి దద్దరిల్లి పోయేలా డ్యాన్సులు స్క్రిప్టు లతో ఈ ఆదివారం ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం జనాల్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ముందుగా హౌస్ నుండి సిరి బయటకు వచ్చినట్టు, ఆమె తర్వాత మానస్, బయటకు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇందులో బిగ్ బాస్ ఇచ్చేటువంటి గిఫ్ట్ ను వీరు తీసుకున్నారా లేదా అనేది మాత్రం బయటకు రావడం లేదు. హౌస్ లో సన్నీ, శ్రీరామ్, షన్ను మాత్రమే ఉండడం ఫినాలి ఉత్కంఠభరితంగా ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా టాప్-2 ఉంటాడని భావించినటువంటి షన్ను మూడో స్థానంలో నిలిచాడని తెలుస్తోంది. దీంతో శ్రీరామ్ కు లైన్ క్లియర్ గా అయినట్టు సమాచారం. గతంలోనే ఇండియన్ ఐడల్ గా నిలిచిన టువంటి శ్రీ రామచంద్ర.. బిగ్బాస్ టైటిల్ కూడా కొట్టేస్తాడు అనే తీవ్రమైన ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఫైనల్ బిగ్బాస్ లో మాత్రం మంచి పర్ఫామెన్స్ కనబరిచి సన్నీయే విజేతగా నిలిచాడని తెలుస్తోంది. అయితే కచ్చితంగా మాత్రం ఈరోజు వచ్చేటువంటి గ్రాండ్ ఫినాలేలో పూర్తిగా తెలియనుంది.
అయితే ఇందులో సిరి మరియు షన్నులు మొదటినుంచి ఇద్దరు కలిసి ఆడడం అభిమానులకు పూర్తిగా నచ్చలేదని తెలుస్తోంది. అయినా వారు ఫ్యాన్స్ ను ఏమాత్రం నిరాశ పరచకుండా చూసుకున్నారు. టాస్కూల్లో ప్రాణం పోస్తూ గెలవడానికి ఎంతో కష్టపడ్డారని దీంతో వారికి ప్రేక్షకులు ఓట్లు వేశారని తెలుస్తోంది. అయితే చివరి రోజున ఫేక్ ఎలిమినేషన్ గేమ్ ద్వారా సిరిని బయటకు పంపడంతో ఆ జంటకు మైనస్ అయింది. వారి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ చాలామందికి సహన పరీక్ష పెట్టింది అని చెప్పవచ్చు. ఈ ప్రభావాన్ని సన్నీ, శ్రీ రాములకు ప్లస్ అయి ఓట్ల వర్షం కురిసినట్లు సమాచారం. ఏది ఏమైనా విన్నర్ ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.