సుకుమార్ కు బాసటగా నిలిచినా అల్లు అర్జున్ !

Seetha Sailaja

‘పుష్ప’ మూవీ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ ఆమూవీ కలక్షన్స్ ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈమూవీకి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు నెట్ కలక్షన్స్ వచ్చాయి అని స్వయంగా ఆమూవీ నిర్మాత మీడియా సమావేశంలో ప్రకటించడంతో ఇప్పుడు ఈ కలక్షన్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.


ఈ వారాంతానికి ‘పుష్ప’ 125 కోట్లు కలక్షన్స్ దాటిపోయిన ఆశ్చర్యం లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈసినిమా నిడివి గురించి అనేక విమర్శలు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు సుకుమార్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘పుష్ప’ పార్ట్ 2 కోసం పుష్ప 1సెకండ్ ఆఫ్ లో లీడ్స్ ఎక్కువగా తీసుకోవలసి వచ్చిందని అందువల్ల ఈమూవీ సెకండ్ ఆఫ్ పెద్దదిగా వచ్చిందని ఈ విషయం తనకు బన్నీకి ముందుగానే తెలుసు అంటూ కామెంట్స్ చేసాడు.


వాస్తవానికి ‘పుష్ప’ కథ అంతా పార్ట్ 2 లోనే ఉంటుందని పార్ట్ 1లో పార్ట్ 2ను దృష్టిలో పెట్టుకుని చాల సన్నివేశాలు పెట్టాము అని వాస్తవానికి ఈమూవీ కథ అంతా పార్ట్ 2లోనే ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఈమూవీ పార్ట్ 2లో మరో మూడు పాత్రలు కలుస్తాయని ఫిబ్రవరి నుండి ఈమూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.


అంతేకాదు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది అక్టోబర్ లో దసరా ప్రాంతంలో ఈమూవీ రిలీజ్ ఉండే ఆస్కారం ఉంది అని లీకులు ఇచ్చాడు. ముఖ్యంగా  మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విశ్వరూపాన్ని పార్ట్-2లో చూస్తారని చెపుతూ ‘పుష్ప’ ఫైనల్ కలక్షన్స్ తేలకుండానే ‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ కు సంబంధించిన విషయాలు ప్రకటించాడు. ఈమూవీకి డివైడ్ టాక్ రావడంతో వెంటనే అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 2ను చేయకుండా మరొక మూవీ చేస్తాడు అంటూ వచ్చిన వార్తలకు సుకుమార్ చాల వ్యూహాత్మకంగా చెక్ పెట్టాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: