రాజమౌళి కరుణ కోసమేనా ఇది!!

P.Nishanth Kumar
రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి హీరో ఎన్నో కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా బహుబలి సినిమా విడుదలైన తర్వాత దేశ వ్యాప్తంగా ఆయనతో చేయాలని భావిస్తున్నారు హీరోలు. అంతకుముందు టాలీవుడ్ లో ఆయనకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. డజను కు పైగా సినిమాలు చేసిన కూడా ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు ఈ దర్శకుడు. తన తో సినిమాలు చేసిన హీరోలందరి కెరీర్ ను సెట్ చేశాడు అని చెప్పవచ్చు. చిన్న హీరోలు గా కొంతమంది ఆయనతో సినిమాలు చేసిన తర్వాత పెద్ద హీరోలుగా మారిపోయి టాప్ హీరో లుగా నిలుచున్నారు.

ఆ విధంగా ఆయన తో సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరబోతున్నారు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడో ఏ హీరో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు దక్కించుకుంటాడో అని అందరు ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు తో తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి చేస్తున్నాడు అనే వార్తలు ఇప్పుడు బయటకు వస్తుండగా మహేష్ అభిమానులలో ఎంతో సంతోషం నెలకొంది ఇప్పుడు.

ఇక తాజాగా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ఈ కార్యక్రమాలను దేశమంతట సాగిస్తున్న రాజమౌళి తాజాగా బాలీవుడ్ లో ప్రమోషన్ చేయగా దానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో రణభీర్ కపూర్ రాజమౌళి కాళ్లకు నమస్కారం చేయడం చూస్తుంటే ఆయన కరుణ కోసమే ఇలా చేశాడా అని అనిపించకమానదు. టాలీవుడ్ హీరోలు రాజమౌళి సినిమా చేయాలని కొట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా పోటీ పెరగడంతో రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: