2021 లో జీరోలైన మన హీరోలు!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో మన హీరోల జోరు చూస్తుంటే ఏడాదికి రెండేసి మూడేసి సినిమాలు విడుదల చేస్తారేమో అనిపిస్తుంది. దానికి తోడు వారు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమా కథను ఓకే చేయడం.. ఒకే సారి రెండు మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచి వాటిని పూర్తి చేస్తూ ఉండటం వంటివి చూస్తుంటే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసిన కూడా వారు చేసే సినిమాలు విడుదల కావు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది కొంత మంది అగ్ర హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు. ఆ విధంగా ఈ ఏడాది విడుదల కానీ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాను విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాను కూడా విడుదల చేయలేకపోయారు. ఆచార్య చిత్రం విడుదల అవ్వాలని ప్రయత్నాలు చేయగా సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూసి ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక మహేష్ బాబు కూడా తన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేసిన తర్వాత సర్కారు వారి పాట సినిమా ఈ సంవత్సరం విడుదల చేయలేకపోయారు.

ఈ సంవత్సరమే ఆ సినిమాను విడుదల చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది వీలుపడలేదు. ప్రభాస్ కూడా సాహో చిత్రం తర్వాత తన ఏ సినిమాను కూడా గత రెండు సంవత్సరాలుగా విడుదల చేయలేక పోయారు. వచ్చే సంవత్సరం రాధే శ్యామ్ చిత్రంతో పాటు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక రామ్ చరణ్ కూడా ఆయన హీరోగా నటించిన సినిమాలను ఈ సంవత్సరం విడుదల చేయలేక పోయారు. వచ్చే సంవత్సరం మొదట్లో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కూడా ఇదే సినిమాతో వచ్చే సంవత్సరం బోనీ కొట్ట నున్నారు. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ను 2020 లో విడుదల చేయగా 2021 లో ఏ సినిమాను విడుదల చేయలేకపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: