బిగ్ బాస్ 5: తన గురించి షాకింగ్ విషయాలు చెప్పిన సన్నీ...!

murali krishna
బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షో నేటితో ముగియనుందట.. నేడు బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే జరగనుందట.చూస్తుండగానే బిగ్ బాస్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది..

ప్రేక్షకులు ఈసారి టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.మొదట 19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన ఈ షోలో ప్రస్తుతం సన్నీ,శ్రీ రామ్, మానస్ మరియు సిరి,షణ్ముఖ్ జస్వంత్ లు మాత్రమే మిగిలారట.ఇక ఈ ఐదుగురిలో ఈ రోజు ఎవరో ఒకరు బిగ్ బాస్ టైటిల్ లో గెలుచుకోబోతున్నారట.. దీంతో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ షో గురించి, టైటిల్ విన్నర్ గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారట. సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే ఫలానా కంటెస్టెంట్ గెలిచాడని ప్రచారాలు సైతం మొదలయ్యాయట.ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లను సరదాగా నవ్వించేందుకు బిగ్ బాస్ ఒక ప్లాన్ చేశారట.ఇందులో భాగంగానే గత సీజన్ కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించి మరియు ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను ఒక ఆట ఆడుకోమని చెప్పాడట.

ఈ క్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ మరియు శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చారట.బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారట.దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారిపోవడంతో అందరూ పగలబడి నవ్వారట.. అనంతరం అఖిల్ సార్థక్ సన్నీని ఈ విధంగా ప్రశ్నించాడట.. మీరు ఎప్పుడైనా డేటింగ్ యాప్ లో ఎవరినైనా కలిసారా అని అడిగాడు ఈ విషయంపై సన్నీ స్పందిస్తూ ఒకసారి ఒక అమ్మాయిని కలిశానని ఆ కలిసిన అమ్మాయి నా గురించి కాకుండా తాను వదిలేసిన తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ పోయింది అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారట.. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుందట.ఇక ఈ పూర్తి ఎపిసోడ్ ను చూడాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందేనని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: