బిగ్ బాస్ 5 విజేతగా సన్నీ.. ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే..?
ఇక సరిగ్గా 15 వారాలు తిరిగేసరికి సన్నీ అన్న మాటను అక్షరాలా నిజం చేసుకున్నారు. నలుగురు ఉన్నా.. మిలియన్ మంది ఫాలోవర్స్ కలిగిన షణ్ముఖ్ ను వెనక్కు నెట్టేసి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేతగా సన్నీ నిలిచారు. ఇకపోతే బిగ్ బాస్ చివరి వారం చివరి రోజున షణ్ముఖ్ సిరి ల మధ్య జరిగిన సన్నివేశాలను.. దృష్టిలో పెట్టుకుని సిరిని ఎలిమినేషన్ చేయనున్నట్లుగా డ్రామాలు ఆడినా.. ప్రేక్షకులు మాత్రం సన్నీ ఎంచుకోవడం ఆశ్చర్యకరం. అయితే బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన ఐదు మంది కంటెస్టెంట్ లలో ఎవరిని బిగ్ బాస్ విజేత గా చూడాలనుకుంటున్నారు అని ఒపీనియన్ పోల్ నిర్వహించగా.. ఎవరూ ఊహించని స్థాయిలో వీజే సన్నీ ఏకంగా 69 శాతం పోలింగ్ తో ముందంజలో ఉన్నారు.
ఇక 16 శాతం మంది ఓట్లతో షణ్ముఖ్ రెండవ స్థానంలో నిలిచారు. సన్నీ మొదటి స్థానంలోనే కొనసాగుతూ వచ్చాడు. ఇక ఆఫీషియల్.. నాన్ ఆఫీషియల్ అనే విషయాలను పక్కన పెడితే.. ఏ పోల్ జరిగినా ఓట్లు వేసేది ప్రేక్షకులే కాబట్టి.. సన్నీ నే సీజన్ ఫైవ్ విజేతగా నిలిచాడు.. ప్రేక్షకులు ఆయనకు బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా పట్టం కట్టారు. నిజానికీ సన్నీ అనుకున్న కళ నెరవేరడంతో ఆయన ఆనందానికి హద్దులు లేవు అని చెప్పవచ్చు.