కాంప్రమైజ్ తో కలవర పడుతున్న సుకుమార్ !

Seetha Sailaja

టాప్ దర్శకులు ఎందరో ఉన్నప్పటికీ సుకుమార్ స్థాయి వేరు. లెక్కలు మాష్టార్ గా జీవితాన్ని ప్రారంభించిన సుకుమార్ తనకు సినిమాల పై ఉండే విపరీతమైన వ్యామోహంతో ఇండస్ట్రీకి వచ్చి టాప్ దర్శకుల లిస్టులోకి చేరినా ఇంకా తన జీవితంలో తీరని అసంతృప్తి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘పుష్ప’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా సినిమాతో ప్రపంచాన్ని మార్చేయాలి అని ‘కసి’ ఉండేదని అయితే అవన్నీ తన ‘ఫేక్’ ఆలోచనలు అని చాల ఆలస్యంగా తెలిసిందని చెపుతూ సమాజంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన విని ఆవేశంతో తిరుగుబాటు చేయాలని కోరిక ఉన్నా ఆపోరాటం చేయలేక తాను కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయాను అంటూ కామెంట్స్ చేసాడు. సమాజాన్ని మార్చాలి అన్నఆలోచనలు విని సమాజాన్ని మార్చాలి అనుకుంటే ‘నీ రాతలతో నీ డబ్బుతో సమాజాన్ని మార్చు. అంతేకాదు నీ భావాలు నమ్ముకుని ఎదుటి వ్యక్తులు ఎందుకు తమ డబ్బును నీ ఆశయాలకు ఖర్చు పెడతారు’ అంటూ ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాటలతో తనకు జీవితంలో జ్ఞానోదయం అయింది అంటున్నాడు.

గతంలో వచ్చిన గొప్ప సినిమాలలో డైలాగ్స్ గొప్పగా ఉండేవని అయితే ఇప్పటి సగటు ప్రేక్షకుడు సినిమాలలో విజువల్స్ వండర్ ఆసిస్తున్నాడని అయితే ఎప్పటికైనా ఈమాయ నుండి బయటపడి తిరిగి డైలాగులు కథ గొప్పగా ఉండే సినిమాల వైపు జనం మళ్ళుతారానే నమ్మకం ఉన్నా అది ఎప్పుడు జరుగుతుందో తనకు నమ్మకం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఐటమ్ సాంగ్స్ పై తనకు ఉన్న మ్యానియా గురించి వివరిస్తూ తాను చిన్నప్పుడు చూసిన ఎన్టీఆర్ మూవీలోని ‘పుట్టింటోళ్ళు తరిమేశారు’ పాటను అనేకసార్లు అప్పట్లో తాను చూసాను అని అప్పటి నుండి తనకు ఐటమ్ సాంగ్ మ్యానియా పట్టుకుంది అంటూ జోక్ చేసాడు.

చాల కష్టపడి ఒక సినిమా తీసాక ఆ సినిమా పై రకరకాల విమర్శలు వస్తుంటే ఈసినిమాతో తన కెరియర్ ముగించాలి అని అనుకున్నా ఆవైరాగ్యం కొద్దిరోజులలో తొలిగిపోయి మళ్ళీ ఉత్సాహంతో మరొక సినిమాను తీస్తానని అయితే తన జీవితంలో మాత్రం ఏదోఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది అంటూ కామెంట్ చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: