2022 లో తెలుగు లో రాబోయే సీక్వెల్ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు సీక్వెల్ ల హవా అంతగా లేదు అనే చెప్పవచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఈ హవా బాగానే కొనసాగుతుంది. కొన్ని సినిమాలు థియేటర్ లాలి విడుదలై విజయం సాధించిన తర్వాత హీరో లు, దర్శక, నిర్మాతలు సీక్వెల్ లకు ప్లాన్ చేస్తూ ఉంటే, మరి కొన్ని సినిమాలకు మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలా కొత్త సంవత్సరం 2022 లో రావడానికి సిద్ధంగా ఉన్న సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం.

బంగార్రాజు : నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు బంగార్రాజు సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది, ఈ సినిమాలో కూడా నాగార్జున హీరోగా నటిస్తూ ఉండగా మరో ముఖ్య పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా కనిపించబోతున్నాడు, ఈ సినిమా 2022 లో విడుదల కాబోతుంది.

పుష్ప : రెండు భాగాలుగా తెరకెక్కిన పుష్ప సినిమా మొదటి భాగం ఈ మధ్యనే థియేటర్ లలో విడుదల అయింది, ఈ సినిమా రెండవ భాగం కూడా 2022 లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎఫ్ త్రీ : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఎఫ్ టు సినిమాకు ఎఫ్ త్రీ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది, ఈ సినిమా లో కూడా  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు,  ఈ సినిమా కూడా 2022 లో విడుదల కాబోతుంది.

కార్తికేయ టు : నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ సినిమాకు కార్తికేయ టు సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది, ఈ సినిమా కూడా 2022 లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

డీ అంటే డీ : మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన డీ సినిమాకు ఈ  సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది, ఈ సినిమా కూడా 2022లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

హిట్ టు : విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మంచి విజయం సాధించిన హిట్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది, ఈ హిట్ టు సినిమాలో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా 2022 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: