కొడుకులకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన తండ్రులు..!
ధనుష్ కు హీరోగా ఆసక్తిగా లేకపోయినా... తన తండ్రి కస్తూరి రాజా పట్టుబట్టి మరీ హీరోగా సినీరంగ ప్రవేశం చేయించాడు. 'తుల్లువాదో ఇలామై' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇక ఈ చిత్ర షూటింగ్లో ధనుష్ సరిగ్గా నటించలేదని.. తన తండ్రి ధనుష్ ను చాలా సార్లు కొట్టాడట. ధనుష్‌ని తండ్రి హీరోగా లాంచ్ చేస్తే, అన్నయ్య సెల్వరాఘవన్ తమ్ముడి కెరీర్ సెట్ చేశాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ 'కాదల్ కొండెయిన్'తో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. పెర్ఫామర్‌గానూ ప్రూవ్ చేసుకున్నాడు. నాన్న, అన్నయ్య సపోర్ట్‌తో కోలీవుడ్‌లో సూపర్ స్టార్ అయ్యాడు ధనుష్. కోలీవుడ్‌లో ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న హీరో శింబు. ఈ స్టార్ తండ్రి టి.రాజేందర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'కాదల్ అజివితిల్లె' సినిమాతో శింబుని హీరోగా లాంచ్ చేశాడు టి.రాజేందర్. ఈ మూవీతో శింబు సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత రాజేందర్ నిర్మాణంలో 'ఇదు నమ్మ ఆలు' చేశాడు శింబు. అంతేకాదు తండ్రి దర్శకత్వంలోనే శింబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
నేచురల్ పెర్ఫామెన్స్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న మళయాళీ స్టార్ ఫాహద్ ఫాజిల్. అయితే నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్న ఫాహద్ ఫస్ట్ మూవీ తర్వాత సినిమాలకి దూరమయ్యాడు. తండ్రి ఫాజిల్ దర్శకత్వంలో చేసిన 'కైయేతుమ్ దూరత్' సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఫాహద్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లాడు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ తండ్రితో కలిసి 'మలయకుంజు' అనే సినిమా చేస్తున్నాడు.
మాస్ డైలాగ్స్‌తో మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకునే పూరీ జగన్నాథ్ వారసుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరీ దర్శకత్వంలో 'మెహబూబా' అనే సినిమా చేశాడు ఆకాశ్ పూరి. అయితే ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. రీసెంట్గా పూరీ జగన్నాత్ కథ, డైలాగ్స్‌తో 'రొమాంటిక్' అనే సినిమా చేశాడు ఆకాశ్ పూరి. అయితే ఈ మూవీ కూడా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు.