షణ్ను, సిరి.. అది నిజమే అని చెప్పేసిన శ్రీరాం చంద్ర..!

shami
బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ముగిసింది. హౌజ్ లో 19 మంది కంటెస్టంట్స్ లో ఒకడిగా వచ్చిన వీజే సన్నీ సీజన్ 5 టైటిల్ గెలిచి సత్తా చాటాడు. ఇక టాప్ 5 వరకు వెళ్లిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టంట్ సిరి మొదటి నుండి తమ ఫోకస్ అంతా ఆట మీద పెట్టింది. టాస్క్ ఏదైనా సరే మేల్ కంటెస్టంట్స్ కు ఈక్వల్ గా సిరి ఆట తీరు సాగిందని చెప్పొచ్చు. అయితే షణ్ముఖ్ తో రిలేషన్ వల్ల అటు షణ్ముఖ్ ఆట పూర్తిగా ట్రాక్ తప్పేసింది.

సిరి, షణ్ముఖ్ మాట్లాడితే ముద్దులు పెట్టుకోవడం.. హగ్గులు ఇచ్చుకోవడం బిగ్ బాస్ ఆడియెన్స్ కు నచ్చలేదు. అందుకే అప్పటి నుండి వీరికి పోటీగా వస్తున్న సన్నీని హీరోగా చేస్తూ వచ్చారు. ఇక షణ్ముఖ్ తో ఫస్ట్ వీక్ నుండి చివరి వరకు అంటి పెట్టుకుని ఉంది సిరి. కేవలం షణ్ముఖ్ కి బయట ఉన్న సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసమే సిరి అలా చేసిందని అందరు అంటున్నారు. ఇదే విషయాన్ని టాప్ 3 కంటెస్టంట్ శ్రీరాం చంద్ర కూడా కన్ ఫర్మ్ చేశారు.

షణ్ముఖ్ తో ఉండకుండా ఉంటే సిరి టాప్ 5 దాకా వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాడు శ్రీరాం చంద్ర. షణ్ను వల్లే సిరి ఇన్నాళ్లు హౌజ్ లో ఉన్నదని చెప్పకనే చెప్పాడు. ఈ కారణం వల్లే ఏమో మిగతా హౌజ్ మెట్స్ చిన్న మాట అన్నా సరే ఎగిరి పడే సిరి షణ్ముఖ్ ఎంత తిడుతున్నా.. దూరం పెట్టినా సరే అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సిరి తన ఆటతో పాటు షణ్ముఖ్ ఆట కూడా పూర్తిగా తినేసిందని అంటున్నారు. ఏది ఏమైనా సిరి, షణ్ముఖ్ లు హౌజ్ లో ఆట ఆడమని పంపిస్తే సీరియస్ ఆ రిలేషన్ లోకి పడేంతగా దగ్గరయ్యారన్నది మాత్రం నిజమని చెప్పొచ్చు. అయితే దీని నుండి వారు ఎలా బయటపడతారు అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: