రవితేజ సినిమాలో ఐటమ్ భామగా RX100 బ్యూటీ..!!

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చుసినా ఐటమ్ సాంగ్స్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా అగ్ర హీరోలు తమ సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తో ఐటమ్ సాంగ్స్ చేయడంతో ఇక ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఇదే సినిమాలో రవితేజ ఓ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ లో ఆర్ ఎక్స్ 100 బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం వినిపిస్తోంది.


అయితే మొదట ఈ ఐటమ్ సాంగ్ లో యాంకర్ అనసూయ ఆ తర్వాత ఈషా రెబ్బని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ అవకాశం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ దక్కినట్లు తెలుస్తోంది. ఇక గతంలో రవితేజ తో డిస్కో రాజా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఐటమ్ సాంగ్ రాబోతుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగి పోయాయి. ఇక ఖచ్చితంగా సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


అంతేకాకుండా ఈ సినిమా  తర్వాత  పాయల్ మరికొన్ని అవకాశాలు కూడా అందుకోవడం ఖాయమని అంటున్నారు.ఇక సినిమా తో పాటు రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో కిలాడి సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: