"83" చిత్రం రన్ టైమ్ ఎంతో తెలుసా..?
తొలిసారి 1983లో క్రికెట్ లో ప్రపంచకప్ ను భారతదేశం కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచినది. ఆ సుమధుర ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’83’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్నది. దేశంలో హిందీతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాలలోనూ దీనిని విడుదల చేస్తున్నారు మేకర్స్. అదేవిధంగా త్రీడీలోనూ ఈ మూవీని సిద్దం చేసారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ’83’ రన్ టైమ్ ను రెండు గంటల 42 నిమిషాల 52 సెకన్లకు లాక్ చేసారు దర్శకుడు కబీర్ ఖాన్.
అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే చిత్రాన్ని నిర్మించారు. కపిల్ దేవ్‌గా రణవీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె, సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్‌గా హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్నాథ్గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారె, రవిశాస్త్రిగా కార్వా మేనేజర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి వంటివారు ఈ చిత్రంలో తమ నటన కనబరిచారు. వారందరీ నటన ఏవిధంగా ఉందో.. సినిమాను ఎలా చిత్రీకరించారో తెలియాలంటే ఈనెల 24 వరకు ఎదురు చూడాలి మరీ.