సిరితో కనెక్షన్.. నాకు మైనస్ అయ్యింది : షణ్ముక్
ఈ సందర్భంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్ లో తమకు ఎదురైన అనుభవాలను.. చేదు జ్ఞాపకాలను కూడా ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టైటిల్ విన్నర్ గా గెలుస్తాడు అని అనుకున్నప్పటికీ చివరికి రన్నరప్ తో సరిపెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే తన బిగ్ బాస్ జర్నీ పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ హౌస్ లో అరె ఏంట్రా ఇది అని ఎప్పుడు అనిపించింది అంటూ అరియనా ప్రశ్నించగా.. సిరి వాళ్ళ మదర్ వచ్చి షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడం నచ్చడం లేదు అంటూ అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటూ సమాధానం చెప్పాడు.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అనుకున్న మీరు రన్నరప్ గా నిలవడానికి కారణం ఏమిటి అని అనుకుంటున్నారు.. మీకు ఒక సోషల్ మీడియా సైన్యం ఉంది కదా ఎందుకు గెలవలేదుఅంటూ ప్రశ్నించగా.. ఎంత సైన్యం ఉన్నప్పటికీ వారికి నచ్చితేనే సపోర్ట్ చేస్తారు నా నెగిటివిటీ ని కూడా సపోర్ట్ చేయరు కదా అంటూ సమాధానం చెప్పాడు. అయితే సిరితో కనెక్షన్ కారణంగానే టైటిల్ చేజార్చుకున్నారా అంటూ ప్రశ్నించగా అదే జరిగింది కదా అంటూ సమాధానం చెప్పాడు షణ్ముఖ్ జస్వంత్. సిరి తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని... సిరి కారణంగా తన రిలేషన్ షిప్ ఎక్కడ దెబ్బతినదు అంటూ చెప్పుకొచ్చాడు.