నాని కొత్త ప్రయోగం.. అలా కనిపించడానికి..15 సార్లు?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా మారిపోయాడు నాచురల్ స్టార్ నాని. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అందరికీ నాచురల్ స్టార్ గా మారిపోయాడు. అయితే కెరీర్ మొదట్లో వరుస విజయాలను అనుకుంటూ దూసుకుపోయిన నాని ఆ తర్వాత మాత్రం ఆ స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే శ్యామ్ సింగరాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాచురల్ స్టార్ నాని. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ్ సినిమా  రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కింది.


 ఇక ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి సరైన హిట్ కొట్టలేకపోయిన నానీ ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటూ చెబుతున్నాడు నాని. డిసెంబర్ 24 తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో ఎంతో బిజీబిజీగా ఉంది. సినిమాలో నాని రెండు గెటప్ లలో కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఈ సినిమాలో గెటప్ కోసం నాని ఎలాంటి రీసెర్చ్ చేశాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  అయితే ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో సరిగ్గా సెట్ కావడానికి దాదాపు 15 విభిన్న గెటప్ లతో ప్రయోగాలు చేసాడట నాచురల్ స్టార్ నాని.. ఒక బెంగాలీ రచయిత గా పాత్రలో ఒదిగి పోయేలా  కనిపించడం కోసం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి మరి ప్రయోగాలు చేశాడట నాని.. ఇటీవలే మీడియాతో మాట్లాడిన నాని సామాజిక కార్యకర్త విప్లవ రచయిత తన పాత్రను క్లుప్తంగా మార్చాలని కోరారు.. అయితే తెరమీద చూడడానికి లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించినప్పటికీ మేకోవర్ మాత్రం ఎంతో కష్టమైంది అంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు 15 గెటప్ లు ట్రై చేసి చివరికి ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ ఫైనల్ చేశాము అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: