భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడటానికి కారణం అతనేనా..?

Anilkumar
ఈ ఏడాది సంక్రాంతికి అనుకొని ఈ విధంగా భారీ సినిమాలు బరిలోకి దిగాయి.ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. అయితే ఇందులో భాగంగా కొన్ని సినిమాల రిలీజ్ డేట్ లు వాయిదా పడడం మనందరికీ తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే సినిమాలు వాయిదా పడడం జరిగాయి. అయితే ఈ రోజు నిర్మాతల సమావేశం చాలాసేపు జరిగింది.. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్లు గా తెలుస్తోంది.


అయితే ఇప్పటివరకు ఏమాత్రం వెనకడుగు వేయని నిర్మాత నాగ వంశీ తన సినిమా హీరో మాటను ఏమాత్రం కాదనకుండా తన మాటను వెనక్కి తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇలా తమ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేయడం వెనక మాటల మాంత్రికుడు అయినా త్రివిక్రమ్ పాత్ర ఉందని అంటున్నారు. అయితే స్వయంగా త్రివిక్రమే అందర్నీ ఒప్పించి ఈ సినిమా డేట్ ను వాయిదా వేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ ఒక్క సినిమానే కాకుండా సంక్రాంతి బరిలో ఆ ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి సినిమా కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.


డివివి దానయ్య, రాజమౌళి స్వయంగా త్రివిక్రమ్ని కలిసి 
భీమ్లా నాయక్ సినిమాను తప్పించాలని కోరినట్లుగా సమాచారం. అయితే దీని తర్వాత పవర్ స్టార్ తో కలిసి త్రివిక్రమ్ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తనతో చర్చించాలని అనుకున్నారట కానీ తన భార్యతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్భంగా విదేశాలకు వెళ్లడంతో కుదరలేదట. అందుకే ఈ విషయాన్ని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో జనవరి 12 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25 కి వాయిదా పడింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: