యశోద నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చిందోచ్..

Satvika
నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల జోరు పెంచింది.. తనకు నచ్చిన విధంగా సినిమాలను లేదా ఐటమ్ సాంగ్ లలో నటించి బాగా పాపులర్ అవుతుంది.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి టాక్ ను అందుకుంది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్స్ తో రికార్డ్ లను బ్రేక్ చేసింది.ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ లో సమంత నటించి యువతకు కిక్కు ఎక్కించింది.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది.


కుర్రకారు మొత్తం ఈమెకు పూజలు చేస్తున్నారు. పాట పై కొన్ని విమర్శలు చేసిన కూడా అంతా కామన్..అని లైట్ తీసుకుంది. ఇక సినిమాల పై దృష్టి పెట్టింది. సామ్ ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తుంది.  గతంలో వద్దనుకున్న సినిమాలకు ఇప్పుడు సైన్ చేస్తుంది.అందులో ఒకటి యశోద.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రత్యేక కథ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. టైటిల్ కు తగ్గట్లు కథ తిరుగుతోంది.


ఈ విషయం పై చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి - హరీష్ లు నూతన దర్శకులు గా పరిచయం అవుతున్నారు..ఇది ఇలా ఉండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. ఇకపోతే మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌  ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఆ సినిమా సమంత ఏ మాత్రం పేరును తీసుకొస్తుందో చూడాలి.. ఏది ఏమైనా సామ్ సినిమాలు ఇప్పుడు యువతను షేక్ చేస్తాయని చిత్ర యూనిట్ భావిస్తుంది.. తన చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: