టాలీవుడ్
హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.తాజాగా
శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.ఇక ఈ
సినిమా రిలీజ్ కి ముందే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు నాని.అంటే సుందరానికి
సినిమా సెట్స్ పైకి వెళ్లిందో లేదో వెంటనే
దసరా అనే మరో సినిమాను మొదలు పెట్టేసాడు.నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంల వహిస్తున్న ఈ సినిమాలో
నాని కి జంటగా
కీర్తీ సురేష్
హీరోయిన్ గా నటిస్తోంది.ఈమెతో పాటు మరో
హీరోయిన్ నిత్యా
మీనన్ కూడా సెకండ్
హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ లో
నాని తెలంగాణ యాసలో పలికిన డైలాగ్
ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేసింది. ఇక ఇదిలా ఉంటె
దసరా సినిమా మేకర్స్ కాస్టింగ్ కాల్ కు ఆహ్వానించారు.ఈ
సినిమా కోసం తెలుగు మాట్లాడే నటీ నటుల కోసం ఓ ప్రకటన జారీ చేశారు.ఆసక్తి ఉన్న తెలుగు రాష్ట్రాల నటీ, నటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చిత్ర యూనిట్.ఇందులో భాగంగానే 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు..అలాగే 8 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య ఉన్న బాల బాలికలకు ఈ అవకాశాన్ని కల్పించారు.
ఆసక్తి ఉన్న వారు dasaracasting@gmail.comకి వీడియోలు పంపించాలని తెలిపారు. అయితే టిక్ టాక్ వీడియోలు,ఇన్స్టారీల్స్ వంటి వాటిని పరిగణలోకి తీసుకోమంటూ స్పష్టం చేశారు మేకర్స్.అంతేకాదు చివరి తేదీగా 31-12-2021 ని నిర్ణయించారుఇక ఈ సినిమాను
సుధాకర్ చెరుకూరి
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇక
సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు ఇక మరోవైపు
నాని నటించిన
శ్యామ్ సింగరాయ్
సినిమా ఈ
డిసెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో
నాని డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే...!!