వామ్మో:RRR మూవీ ప్రమోషన్స్ చూస్తే షాక్..!
ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఏ సినిమాను పోటి విడుదల కాకుండా కొంత మంది స్టార్ హీరోల ప్రొడ్యూసర్లని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. దాంతో వారు ఒప్పుకొని రాజమౌళి గౌరవాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లు ఎక్కడ చూసిన కనిపిస్తూనే ఉన్నాయి. కాదు వీరు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆఖరికి ఫుడ్ కోర్టును కూడా వదలడం లేదని తెలుస్తోంది. అంటే డిసెంబర్ 24 వ తేదీన Zomato వారు ఆర్.ఆర్.ఆర్ టీం తో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇక అక్కడ కూడా వీరు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ని విషయాలను తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా యూనిట్ సభ్యులు.
ఇకపోతే ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలలో పెద్ద ఎత్తున భారీ స్టేజ్ లను ఏర్పాటు చేసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి హీరోలు, హీరోయిన్లు కూడా స్టేజీపైన సందడి చేస్తూ అభిమానులకు సంతోషాన్ని కలిగించారు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి రూ .400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు స్థాయిలో లాభాలు ఆర్జించాలని మనం కూడా కోరుకుందాం