టాలీవుడ్ టాలెంటెడ్ హీరో లలో ఒకరు విజయ్ దేవరకొండ.. పవన్ తర్వాత యువత లో అంత క్రేజ్ ను సంపాదించుకున్న హీరో ఇతను. అతి తక్కువ సమయంలో టాప్ లిస్ట్ లోకి వెళ్ళిన హీరో.. రొమాంటిక్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు.
గ్లామరస్ బ్యూటీ రష్మిక కూడా వరుస అవకాశాలు అందుకుంటు ఫుల్ బిజిగా ఉన్నారు.ఈ జంట రెండు సినిమాల లో నటించారు. మొదటి సినిమా భారీ హిట్ ను అందుకుంటే రెండో సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే సినిమాల పుణ్యమా అని విజయ్, రష్మిక మంచి స్నేహితులు మాత్రం అయ్యారు. వీరిద్దరు కలిసి ఇటీవల ముంబై కి డేట్ కు వెళ్లారు. అలా వారిద్దరు మీడియా కెమరాలకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యారు.వరుస సినిమాలు చేయడం తో వారిద్దరు ప్రేమలో పడ్డారని చాలా వార్తులు చక్కర్లు.ఇప్పుడు వీరిద్దరూ కలిసి డేట్ కి వెళ్లడంతో మరొకసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. కానీ వీరిద్దరు మాత్రం మేము ఫ్రెండ్స్ అంటూ కవర్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా..తాజాగా విజయ్ దేవరకొండ ఒక ఆసక్తి గల పోస్ట్ ను చేసాడు. మొన్న వీరిద్దరు కలిసి డేట్ కు వెళ్ళినప్పుడు విజయ్ వేసుకున్న అదే యానిమల్ ప్రింట్ షర్ట్ ఈ ఫొటోలో కూడా వేసుకొని కనిపిస్తాడు.. అంతే కాదు చేతిలో మందు బాటిల్ కూడా పట్టుకోని ఉంటాడు.ఫోటోను షేర్ చేస్తూ విజయ్ ''నేను గత వారం నుండి చాలా మద్యపానం సేవిస్తున్నాను'' అంటూ ఫొటోకు జత చేశాడు.విజయ్ సినిమాల విషయానికొస్తె.. లైగర్ సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతుంది.రష్మిక మాత్రం ఇటీవల విడుదల అయ్యి ఘన విజయాన్ని అందుకున్న పుష్ప సినిమా లో నటించింది..ఆ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.