ఇంట మునిగి రచ్చ గెలవడం అంటే ఇదే!!
అయితే ఈ చిత్రం విడుదలైన రోజు దగ్గర నుంచి తెలుగు నాట సినిమాకి మిశ్రమ స్పందన వస్తుందని చెప్పాలి. కొంత మంది ప్రేక్షకులు ఈ సినిమాపై నెగిటివ్ గా స్పందన ఇస్తుంటే మరి కొంత మంది పాజిటివ్ గా స్పందన ఇస్తున్నారు. మొత్తానికి అరవై శాతం ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పవచ్చు. 40 మంది శాతం మంది కి ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. అయితే తెలుగునాట కాకుండా ఇతర భాషల్లో విడుదలైన ప్రతి చోట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రాలేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని చెప్పడం జరిగింది.
సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా తో వీరు హ్యాట్రిక్ అందుకోగా ఈ చిత్రం యొక్క రెండవ భాగం పై ఇప్పుడు అంచనాలు భారీ గా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసి మరొక సక్సెస్ సాధించాలని చిత్ర యూనిట్ భావిస్తుండగా తెలుగు వారికి ఈ రెండవ భాగం అయినా నచ్చుతుందా అనేది వేచి చూడాలి. ఇదంతా చూస్తుంటే ఇంట ఓడి రచ్చ గెలవడం అనే సామెత గుర్తొస్తుంది. సొంత భాషలో ఈ సినిమా కు నెగెటివ్ టాక్ వస్తే పరాయి భాషలలో పాజిటివ్ టాక్ రావడం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.