లవ్ బర్డ్స్ బ్రేకప్.. అయ్యో బిగ్ బాస్ ఎంత పనిచేసింది..?

shami
యూట్యూబ్ లో సెన్సేషనల్ కపుల్ గా క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్, దీప్తి సునైనాల ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. తనలోని టాలెంట్ మెచ్చి అతనికి సపోర్ట్ గా నిలిచిన దీప్తితో షణ్ముఖ్ దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 2 టైం లోనే దీప్తి హౌజ్ లో ఉంటే షణ్ముఖ్ పేరుని తలచుకుంటూ ఆట ఆడింది. ఇక మరోపక్క మూడేళ్ల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టంట్ గా వచ్చాడు. అసలైతే తానే గెలవాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సన్నీని గెలుపు వరించింద్ది.
బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ ఆట తీరు తన ఫ్యాన్స్ ను మెప్పించినా తన లవర్ ని మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ అవడం ఆమెకు నచ్చలేదు. అఫ్కోర్స్ అదే షణ్ముఖ్ ని కప్ కు దూరమయ్యేలా చేసింది. సీజన్ 5లో రన్నర్ గా నిలిచాడు షణ్ముఖ్ అయితే అతన్ని కలిసేందుకు కానీ మాట్లాడేందుకు కానీ ప్రయత్నించలేదు దీప్తి సునైనా. హౌజ్ లో సిరితో అతను అంతగా క్లోజ్ గా ఉండటం దీప్తిని హర్ట్ చేసినట్టు తెలుస్తుంది.
అందుకే అమ్మడు వరుసగా ఇన్ స్టాగ్రాం లో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ నీ మనస్సాక్షితో అయినా నిజాతీగా ఉండు అని కామెంట్ పెట్టింది. అంతేకాదు ఇది బెస్ట్ ఇయర్ కాదని కానీ చాలా విషయాలను నేర్చుకున్నా అంటూ దీప్తి సునైనా ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. ఇవన్ని చూస్తుంటే బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ చేసిన వ్యవహారం దీప్తిని బాగానే హర్ట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. సిరి, షణ్ముఖ్ మాట్లాడితే హగ్ చేసుకుని ఫ్రెండ్ షిప్ ఆంటీ అని అనడం ఆడియెన్స్ కు కూడా వారిద్దరు చేస్తున్న అతి అర్ధమైంది. మరి లవ్ బర్డ్స్ నిజంగానే విడిపోతున్నారా లేక కొద్దిగా టైం తీసుకుని కలుస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: