టాప్ హీరోలకు సవాల్ విసురుతున్న నాని అభిమానులు !

Seetha Sailaja
సాధారణంగా అత్యంత భారీ కటౌట్ లు టాప్ హీరోల సినిమాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేయడం ఆవీరాభిమానుల అలవాటు. అలా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ లకు పాలాభిషేకాలు చేయడం పెద్దపెద్ద గులాబి దండలు వేయడం బాణసంచా కాల్చడం లాంటి పనులు టాప్ హీరోల అభిమానులు చేస్తూ ఉంటారు.

ఇప్పుడు నాని అభిమానులు కూడా తమ నేచురల్ స్టార్ ను టాప్ హీరోగా చూడాలని తెగ ముచ్చట పడుతున్నారు. ఈ ముచ్చటలో భాగంగా నాని వీరాభిమానులు 63 అడుగుల భారీ కటౌట్ ను హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కటౌట్ ఏర్పాటు చేసిన తరువాత చేసిన హంగామా టాప్ హీరో అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా మారింది.

ఇప్పటికే వరస ఫ్లాప్ లలో ఉన్న నాని ఎలాంటి భయం లేకుండా ‘అఖండ’ ‘పుష్ప’ కలక్షన్స్ ఇచ్చిన జోష్ తో క్రిస్మస్ రేస్ లో నిలిచాడు. నాని ‘శ్యామ్ సింగ్ రాయ్’ మూవీకి చెప్పుకోతగ్గ స్థాయిలో పోటీ లేకపోయినప్పటికీ ఇదే క్రిస్మస్ సీజన్ కు విడుదలకాబోతున్న బాలీవుడ్ మూవీ 83 నాని ఆశల పై నీళ్ళు జల్లుతుందా అన్నసందేహాలు కూడ ఉన్నాయి.

తన మూవీ కథ పై విపరీతమైన నమ్మకం పెట్టుకున్న నాని ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యేంతవరకు తన మూవీకి కలక్షన్స్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు అన్నధైర్యంతో క్రిస్మస్ రేస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. సాయి పల్లవి కృతి శెట్టిల మ్యానియా కూడ తనకు బాగా సహకరిస్తుందని నాని నమ్మకం. 1970 ప్రాంతంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళే ఈమూవీ కథ నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నాని పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. గత కొంతకాలంగా నాని మిడిల్ రేంజ్ హీరోల స్థాయి నుండి టాప్ హీరోల రేస్ లోకి ఎంటర్ కావాలని చాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: