ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్డేట్.. ఫోర్త్ సింగిల్ ప్రోమో రిలీజ్

Veldandi Saikiran
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా... ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఏదైనా ఉందంటే.. అందులో మొదటి వరుసలో ఉంటుంది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఈ ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా కోసం ఎంతో మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది అనే ఆసక్తితో... థియేటర్ల ముఖం చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి అందరికీ విధి తమే. చెయ్యి సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తిలకిస్తున్నారు టాలీవుడ్ సంచలన దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. అలాగే ఈ సినిమాలో ఎంతో మంది బాలీవుడ్ స్టార్లు కూడా నటించడం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ఓ సహాయక పాత్రలో కనిపిస్తుండగా .. ఆలియా భట్ సీత పాత్రలో కనువిందు చేయనుంది. 


అలాగే టాలీవుడ్ నటి శ్రియ కూడా ఈ సినిమాలో కనువిందు చేయనుంది. ఇక ఈ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు కనువిందు చేయనున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు సినిమాపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశాయి. ఇలాంటి తరుణంలో తాజాగా మరో బిగ్ అప్డేట్ వదిలింది  ఆర్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బృందం. Revolt of bheem పేరుతో సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు. కొమరం భీముడో అంటూ సాగే ఈ సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. అలాగే ఈ సాంగ్ లిరిక్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇవ్వాలా ఈ సాంగ్ ప్రోమో విడుదల కాగా పూర్తి సాంగ్ రేపు సాయంత్రం చిత్రబృందం విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తానికి ఈ సాంగ్ సినిమాపై అంచనాలు రేంజ్ కు తీసుకు పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: