టాలీవుడ్ మూవీలో విరాట్ కోహ్లీ అతిధి పాత్ర...?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్న విరాట్ ఇటు ఇండస్ట్రీకి కూడా చాలా దగ్గర బంధువయ్యారు. పలు యాడ్స్ లోనూ యాక్ట్ చేసి మెస్మరైజ్ చేశారు ఈ హ్యాండ్సమ్ క్రికెటర్. అయితే ఇపుడు నేరుగా ఓ సినిమాలో మన ముందుకు యాక్టర్ గా కనిపించడానికి వచ్చేస్తున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. అందులోనూ అది తెలుగు సినిమా అని తెలుస్తుండడం విశేషం. టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా చిత్రంలో విరాట్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. పాత్ర నిడివి చాలా తక్కువేనని తెలుస్తోంది.
అయినా ఇంత పెద్ద క్రికిటర్ అందులోనూ కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికుల ప్రేమను గెలుచుకున్న స్టార్ క్రికెటర్ సినిమాలో కనిపించనున్నారు అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే విరాట్ ఈ సినిమా కోసం కేవలం కొన్ని గంటలు మాత్రమే వెచ్చిస్తే సరిపోతుందని రిక్వెస్ట్ చేయడంతో ఆయన సరే అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ క్రికెటర్ విరాట్ తో పాత్రకు సంబందించిన వివరాలను చర్చిస్తున్నట్లు టాక్. మరి ఈ సినిమా ఎంటి..?? ఎంతవరకు కరెక్ట్..?? హీరో ఎవరు...అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి.