రాంచరణ్ కోసం ఆ సినిమా ఒప్పుకున్న చిరంజీవి...!
అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన్నప్పటి నుంచి దాదాపు సినిమాలన్నీ రామ్ చరణ్ నిర్మించారని సమాచారం.. ఖైదీ నెంబర్ 150 మరియు సైరా నరసింహారెడ్డి సినిమాలను నిర్మించిన రామ్ చరణ్ ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాని కూడా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు మాత్రమే కాక మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న "గాడ్ ఫాదర్", మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ అయినా "భోళా శంకర్" మరియు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొక సినిమా సైన్ చేశారని తెలుస్తుంది చిరంజీవి. "భోళా శంకర్" సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారని సమాచారం.
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం.. గతంలో "తేజ్ ఐ లవ్ యు" ఈవెంట్ కి వచ్చిన రామ్ చరణ్ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. కానీ ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్న రామ్ చరణ్ తన మాట నిలబెట్టుకో లేకపోయారని తెలుస్తుంది.
అందుకనే మెగాస్టార్ చిరంజీవి క్రియేటివ్ కమర్షియల్స్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని సమాచారం.. అయితే చిరంజీవి కి క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో పనిచేయడం ఇది మొదటిసారి కాదని తెలుస్తుంది. గతంలో చిరంజీవి నటించిన "అభిలాష", "చాలెంజ్", "రాక్షసుడు" మరియు "మరణమృదంగం", "స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్" చిత్రాలను క్రియేటివ్ కమర్షియల్స్ వారే నిర్మించారని తెలుస్తుంది..అప్పట్లో ఆ బ్యానర్ లో వచ్చిన చిరు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ సాధించాయి మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరి.