పాన్ ఇండియా స్థాయి పై నాని సంచలన వ్యాఖ్యలు !
తాను తెలుగు హీరోని అయినప్పటికీ చెన్నై బెంగుళూరు లాంటి దక్షిణాది నగరాలకు వెళ్ళినప్పుడు తెలుగువారు కానప్పటికీ అక్కడి ప్రజలు తనను గుర్తుపట్టి తనతో ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు అడిగినప్పుడు తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. ‘శ్యామ్ సింగ్ రాయ్’ గురించి మాట్లాడుతూ ఈమూవీ తెలుగులో తీసినప్పటికీ ఈమూవీకి ఉన్న కథ రీత్యా పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నప్పటికీ తాను కేవలం ఈమూవీని దక్షిణాది భాషలలో మాత్రమే రిలీజ్ చేస్తున్నాను అంటూ తనకు దక్షిణాది స్టార్ అనిపించుకోవడం ఇష్టం అంటున్నాడు.
ఈమూవీలో వచ్చే నాలుగు సన్నివేశాలు ఈమూవీకి అత్యంత కీలకం అని చెపుతూ ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు తమకు తెలియకుండానే తామంతా 1970 ప్రాంతాలలోకి వెళ్ళిపోతారు అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. వాస్తవానికి ఈమూవీకి పోటీగా మరో పెద్ద తెలుగు సినిమా విడుదల కానప్పటికీ ఈమూవీతో పోటీగా విడుదల అవుతున్న బాలీవుడ్ మూవీ ‘83’ పై అర్బన్ యూత్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
దీనికితోడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఒమైక్రాన్ భయాలు విపరీతంగా పెరిగి పోవడంతో నాని సినిమాలకు గుండెకాయ గా నిలిచే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు ‘శ్యామ్ సింగ్ రాయ్’ వైపు అడుగులు వేస్తారు అన్నది వేచి చూడాలి..