నాచురల్ స్టార్
నాని హీరోగా
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సబాస్టియన్
హీరోయిన్ లుగా తెరకెక్కిన
సినిమా శ్యామ్ సింగరాయ్, ఈ సినిమాకు టాక్సీ వాలా
సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న
రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించాడు, ఈ సినిమాలో
నాని డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో కృతి శెట్టి మాడ్రన్ పాత్రలో కనిపించబోతుంది, ఈ విషయం మనకు చిత్ర బంధం ట్రైలర్ ద్వారానే మనకు తెలియజేసింది. అలాగే ఈ సినిమాలో
సాయి పల్లవి దేవదాసి పాత్రలో కనిపించబోతుంది, ఇలా నాచురల్ స్టార్
నాని హీరో కావడం ఉప్పెన
సినిమా తర్వాత కృతి శెట్టి ఈ సినిమాలో నటించడం,
సాయి పల్లవి దేవదాసి పాత్రలో నటించడం ఇలా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్ ఉండడంతో జనాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పిన ఈ
సినిమా ఈ రోజు అనగా
డిసెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు
మిక్కీ జె మేయర్ సమకూర్చిన సంగీతం చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది, ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సమకూర్చిన సంగీతం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లే విధంగా ఉందని కూడా పలువురు తెలియజేస్తున్నారు, అలాగే ఈ సినిమాలో
నాని మాడ్రన్ పాత్రలోనూ మరియు కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ పాత్రలను పోషించాడు. ఈ రెండు పాత్రల్లో కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగే పాత్ర చాలా అద్భుతంగా ఉంది అని, సినిమాకు ప్రధాన ఆకర్షణ అని కూడా పలువురు తెలియజేస్తున్నారు. ఇలా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ లో
నాని నటన, మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాకు సూపర్ హైలెట్ అని తెలుస్తోంది.