రాధేశ్యామ్: 'ప్రేరణ' పాత్ర హైలైట్ కానుందా?

VAMSI
ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న ప్రభాస్ మూవీ 'రాధేశ్యాం' వచ్చేనెల అనగా జనవరి 14 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర విడుదలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా వేగం కనబడుతూనే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ను కనుక గమనిస్తే రెండు క్రేజీ అప్డేట్స్ దాగి ఉన్నాయి. అందులో ఈ కథకు కీలకమైన కీ పాయింట్ , కథను మలుపు తిప్పే అంశం సముద్రం మధ్యలో పెద్ద షిప్ లో జరగబోతుంది అని ఆ సీన్ కథకు కీలకం అవుతుందని, అసలు మిస్టరీ అంతా అక్కడే ఉందని అర్థమౌతోంది.

ఇక రెండవది ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారి పాత్ర స్టోరీకి మరో హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేశారు. ఇందులో నటుడు కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కనిపించారు. అలాగే మొదట టైటిల్ ను బట్టి హీరోయిన్ పేరు రాధ అని చాలా మంది అనుకోగా  ప్రేరణ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఊహించలేనన్ని ట్విస్ట్‌లు, టర్నింగ్స్‌ ఉన్నాయని అర్థమౌతోంది.  నాలుగేళ్లు  శ్రమించి తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాలను మించి అందించేలా కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా కథ రాయడానికి 18 ఏళ్లు పట్టిందట.

ముందుగా ఈ కథను రాధాకృష్ణ డైరెక్టర్ చంద్రశేఖర్‌ యేలేటి వద్దకు తీసుకెళ్లారట. మొదట ఈ కథ వినిపించగా ఆ తరువాత ఈ కథకు కంక్లూజన్ ఇవ్వడానికి, అన్ని విధాలుగా కుదరటానికి ఇన్నేళ్లు పట్టిందట. మరి అంతటి కథ ప్రభాస్ కు సెట్ అవ్వాలని రాసి ఉంది మరి. సినిమా ఫలితం ఏ విధంగా ఉండనుంది అన్నది తెలియాలంటే విడుదలకు వరకు ఆగాల్సిందే. ఇందులో ప్రేరణ పాత్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: