డార్లింగ్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాధే శ్యామ్.. జిల్ ఫెమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్స్, పాటలు,ఇక ట్రైలర్ లు ఇలా అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాల ను పెంచుతున్నాయి. రోమాటింక్ బాయ్ గా స్టైల్ లుక్ లో డార్లింగ్ కనిపించనున్నాడని పోస్టర్ లను చూస్తె తెలిసిపోతుంది.
ఈ సినిమా ఫ్యాన్స్ తో విజిల్స్ వెయిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే ఫ్యాన్స్ కోరిక మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఇది మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలీ. గురువారం రామోజి ఫిలింసిటీ లో గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది.. రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఈవెంట్ లో మరింత జోష్ ను పెంచెందుకు చిత్రం నుంచి మరో ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ప్రభాస్ మాట్లాడుతూ..రాధేశ్యామ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానుల తో పంచుకున్నారు.. డార్లింగ్ మాట్లాడగానే అందరి ఒక్కసారిగా కేక లతో హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాస్త తొక్కిసలాట జరిగింది. కొందరు అభిమానులు గాయపడ్డారు.. దీనికి డార్లింగ్ క్షమాపణలు చెప్పారు. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పనిచేశాం.. ఇందులో పని చేసిన వారికి పేరు పేరున ప్రభాస్ ధన్యవాదాలు తెలిపారు. స్టేజ్ పై డార్లింగ్ మాట్లాడిన ప్రతి మాట అందరినీ ఆకర్షించాయి. మొత్తానికి సినిమా హిట్ అనే టాక్ విడుదల ముందే రావడం గ్రేట్.. సినిమా థియేటర్ లోకి వచ్చిన తరువాత ఎలా వుంటుందో చూడాలి.. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..