నాని వన్ మెన్ షో.. ఈ షోలో అదే హైలెట్..
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా చేసిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా చేశారు అనే కితాబు దక్కించుకోవడం ఈ సినిమా విజయానికి గల ముఖ్య కారణం. ఓవరాల్ గా ఈ సినిమాలో నాని వన్ మెన్ షో చేశాడని చెప్పవచ్చు. ఆయన నటన ఈ సినిమాలో హైలెట్ కాగా రాహుల్ సాంకృత్యాయన్ ఎంచుకున్న కథ తీసిన విధానాన్ని చాలా మెచ్చుకోవచ్చు అనే చెప్పాలి.
ఈ సినిమాలో కృతి శెట్టి గ్లామర్ పాత్రలో తొలి సారిగా నటించి ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఎంతగానో అలరించింది. తొలిసారిగా ఆమె ఈ స్థాయిలో గ్లామర్ పండించటంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఇది ఆశ్చర్యపరిచింది. తొలి సినిమా ఉప్పెన తో మంచి అభినయం కనబరిచిన ఈ ముద్దుగుమ్మ తన లో గ్లామర్ కోణం చూపించే టాలెంట్ కూడా ఉందని ఈ సినిమాతో నిరూపించి గ్లామర్ కథానాయికగానే తాను ఎదగాలని అనుకుంటున్నాను అని చెప్పకనే చెప్పింది.
ఈ సినిమాలో నాని నటన తర్వాత ఈమె గ్లామర్ ఎక్కువ హైలైట్ అయింది అని చెప్పవచ్చు. కుర్రకారు ఈమెను ట్రైలర్ లోని సీన్స్ చూసిన తర్వాత ఎగబడి మరీ టికెట్స్ కొనుక్కుని ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు అంటే దానికి కృతి న్ కారణం. ఆ విధంగా నాని ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది. మరి ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులు రావడానికి అలవాటు పడుతున్న క్రమంలో శ్యామ్ సింగ రాయ్ ఏ స్థాయిలో వసూలు సాధించి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.