RC16.. బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్.. ప్లాన్ అదిరింది..!

shami
మెగా పవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ లో ఫస్ట్ టైం సౌత్స్టార్ డైరక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా జెర్సీ ఫేం గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నాని జెర్సీతో డైరక్టర్ గా తన ప్రతిభ చాటుకున్న గౌతం తిన్ననూరి ప్రస్తుతం జెర్సీ హిందీ వర్షన్ ను రెడీ చేశాడు. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చరణ్ తో చేస్తున్న సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తోనే వస్తుందని అంటున్నారు.

సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో పూరీ డైరక్షన్ లో వచ్చిన లోఫర్ సినిమాలో నటించింది దిశా పటాని. ఆ తర్వాత పెద్దగా కనిపించని అమ్మడు బాలీవుడ్ లో అదరగొడుతుంది. అక్కడ వరుస స్టార్ ఛాన్సులతో దూసుకెళ్తున్న దిశా పటాని చరణ్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నదని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ లో దిశాని తీసుకోవడం వనక మరో రీజన్ కూడా ఉందని అంటున్నారు. ఎలాగు ఆర్.ఆర్.ఆర్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటున్న చరణ్ తన నెక్స్ట్ సినిమా శంకర్ సినిమాతో కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. అందుకే గౌతం తిన్ననూరి సినిమా కూడా నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు అందించాలని చూస్తున్నారు. అందుకే దిశా అయితే అన్నివిధాలుగా పర్ఫెక్ట్ అని ఆమెని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. దిశా కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా ఎక్సయిటింగ్ గా ఉందని అంటున్నారు.  ఈ సినిమా తర్వాత దిశా పటాని కూడా సౌత్ లో బిజీ హీరోయిన్ అవుతుందని చెప్పొచ్చు. చరణ్ శంకర్ తో చేస్తున్న సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు దిశాని ఫిక్స్ చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: