RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వైఎస్ జగన్..?
ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమపై కొన్నాళ్లుగా విధిస్తున్న ఆంక్షలు గురించి తెలిసిందే. ముఖ్యంగా టికెట్ రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగు చల చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుంది. అయితే ఈ విషయం జగన్ కు తెలియచేసేలా రెండు మూడు సందర్భాల్లో చర్చలు జరిగినా అవేవి సఫలం కాలేదు. ఏపీలో ఆన్ లైన్ టికెట్ విధానంతో పాటుగా టికెట్ ప్రైజ్ ఇష్యూ ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కు వైఎస్ జగన్ ను పిలిచి ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ కేటగిరీ కింద టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కోసం చూస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు పెరిగే ఛాన్సులు ఉన్నాయని ఇప్పటికే లీక్స్ వస్తున్నాయి. అయితే సీఎం జగన్ ను ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచి పరిశ్రమ సమస్యలను మరింత డీటైల్డ్ గా వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కు వస్తే మాత్రం ట్రిపుల్ ఆర్ టికెట్ రేట్లు పెరిగినట్టే అని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్,తో పాటుగా హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ కూడా నటించారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కల్పిత కథతో రాజమౌళి అద్భుతంగా సినిమా తీర్చిదిద్దుతున్నారు.