అయ్యో:మరొకసారి వివాదంలో చిక్కుకున్న సనిలియోన్..!

Divya
బాలీవుడ్ లో ఐటెం గర్ల్ గా పేరు పొందింది సన్నీ లియోన్. అయితే దాదాపు రెండు సంవత్సరాల వరకు తన హవా కొనసాగించిన సన్నీ లియోన్.. గత కొద్దిరోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉండేది. ప్రస్తుతం సన్నీ లియోన్ ఫక్ ఆల్బమ్ లతో చాలా బిజీగా ఉంటోంది. ఇక అప్పుడప్పుడు తెలుగులో కూడా ఏదో ఒక సాంగ్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఒక సినిమాలో కనికా కపూర్ పాటలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. రెండు రోజుల క్రితం ఈ పాటను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట నెటిజన్ల విమర్శలు పొందుతూనే ఈమెపై ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది.

ఈ సాంగ్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండడంతో.. సన్నీలియోన్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె చేసిన బోల్డ్ ఫర్ఫార్మెన్స్ పై  కూడా చాలా కోప్పడుతున్నారు.ఇక ఒక భక్తురాలు అయినటువంటి రాధ మధుబన్ లా డ్యాన్స్ చేయడాన్ని సన్నిలియోన్ చేయడంతో ఆమె ఇలా చేస్తుందా అంటూ విరుచుకు పడుతున్నారు. ఒక దేవుడిని కించపరిచే హక్కు ఎవరికీ లేదంటూ సన్నీలియోన్  పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్నీలియోన్ హిందూ సంప్రదాయాలను, విలువలను చాలా దిగజారిపోయే అంతగా.. మూవీలో వారు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్ రూపంలో తెలపడం జరిగింది.

ఈ సాంగును వెంటనే తొలగించాలని, ఆ తరువాత అందరి ముందు క్షమాపణలు తెలపాలని.. లేకపోతే చాలా తీవ్రంగా పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఈ పాట వల్ల చాలా వివాదాస్పదంగా మారుతోంది. ఇక ఈ సాంగ్ కి షరీబ్ తోషి, గణేష్ ఆచార్య.. కొరియోగ్రాఫర్ చేయడం గమనార్హం. సన్నీ లియోన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ పాటని షేర్ చేయడం పై ఆమె పై చాలా మంది రకరకాలుగా ట్రోలింగ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: