ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడుతుంది అంటున్నారే!!
ఇద్దరు పెద్ద టాలీవుడ్ సినిమా హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క విడుదలపై మరొకసారి అందరిలో గందరగోళం నెలకొంది. ఈ చిత్రం విడుదల ఆగిపోతుందని ఈ సినిమా విడుదలవడం చాలా కష్టమని ఓ వైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏదైనా పెద్ద సినిమా వచ్చే ముందు ఈ విధంగా క్రియేట్ చేయడం సహజమే.
అయినప్పటికీ రాజమౌళి అభిమానులలో సినిమా అభిమానుల లో ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఇది కొంత పెన్షన్ పుట్టిస్తుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. బాహుబలి సినిమా తో సంచలన రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి ఈ సినిమాతో ఇం కా ఎలాంటి సంచలనమైన రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుండగా ఈ చిత్రం ఎలాంటి సంచల న వసూళ్లను సాధిస్తుందో చూడాలి. మొత్తం ఐదు భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా పై అన్ని భాషలలోనూ మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా తప్పకుండా అందరు ప్రేక్షకులను అలరిస్తుందో అనేది చూడాలి.