RRR కు భారీ షాక్.. అయోమయంలో ఫ్యాన్స్..

Satvika
మొన్న పుష్ప, నిన్న శ్యామ్ సింగ రాయ్ సినిమా కబుర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి దగ్గర కొస్తున్న కొద్ది విడుదలయ్యే సినిమా లపై అభిమానులు గట్టిగా ఆసక్తి కనబరుస్తున్నారు.. సంక్రాంతి బరిలో ట్రిపుల్ ఆర్ కూడా వుంది. ఈ సినిమాను చాలా గొప్యంగా తెరకెక్కిస్తున్నారు.. రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటం తో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే..


సినిమా కోసం వీరు చేసిన సాహాసాలకు సంబంధించిన వీడియోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అవుతుంది. కనుక ప్రతి ఒక్క ఇండస్ట్రీ లోని జనాలను విపరీతంగా ఆకట్టుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూన్న ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడేప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


అన్నీ కార్యాక్రమాలు కూడా పూర్థయ్యాయి. కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాల్ల వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగి పోతుండడంతో ప్రభుత్వం నియంత్రణ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో నైట్ కర్ఫ్యూ అమల్లొకి వచ్చింది. ఇక మహారాష్ట్ర లో కూడా అదే విధంగా కర్ఫ్యూ విధించారు.ఇక పాన్ ఇండియా చిత్రాలకు హిందీ నుంచే మేజర్ షేర్ వస్తుంది. కానీ, ఇప్పుడు మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు.. ఉన్న థియెటర్స్ కు కూడా 50 ఆక్యుపెన్సీనే ఉందని ప్రభుత్వాలు తెలిపాయి.. ఈ వేరియంట్ ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావాన్ని చూపెలా ఉండటం తో చిత్రబృందం ఆలోచనలో పడింది. చాలా కాలం తర్వాత వస్తున్న అభిమాన హీరోల సినిమాకు ఇలా జరగడం పై అయోమయంలో ఉన్నారు. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు జక్కన్న మ్యాజిక్ చేస్తారేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: