ఆ హీరోయిన్ వ‌ల్లే బాల‌య్య - ర‌వితేజ మ‌ధ్య గ్యాపా... ఆ క‌ట్టుక‌థ ఇదే..?

Divya
యువరత్న నందమూరి బాలకృష్ణ - మాస్ మహారాజ్ రవితేజ మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయన్న పుకార్లు ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నాయి. బాలయ్య, రవితేజ సినిమాల‌లో నటించిన ఒక హీరోయిన్ వల్లే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం అప్పట్లో ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత బాలయ్య - రవితేజ నటించిన సినిమాలు మూడు.. నాలుగు సార్లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. దీంతో ఈ పుకార్లకు మరింత ఊతం వచ్చినట్లు అయింది. బాలయ్య - రవితేజకు వార్నింగ్ ఇవ్వడంతో రవితేజ కావాలని బాలయ్య సినిమాల‌కు పోటీగా తన సినిమాలను రిలీజ్ చేయించారని అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కటే పుకార్లు షికార్లు చేసేవి.
అయితే ఇదంతా నిజమే అని.. ఇప్పటివరకు అందరూ నమ్మారు. తాజాగా ఆహా ఓటీటీలో బాలయ్య టాక్ షోకి వచ్చిన మాస్ మహారాజ రవితేజ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. బాలయ్య షో లోకి రవితేజ ఎంట్రీ ఇచ్చిన వెంటనే బాసు మనిద్ద‌రి మధ్య ఏదో గొడవలు ఉన్నాయట క‌దా ? అని అడిగే సారు. వెంటనే రవితేజ అవునా ?  సార్ కొందరు డాష్ డాష్ డాష్ నా... లు చేసిన ప్రచారమే ఇదంతా అని కొట్టిపారేయడంతో పాటు బాలయ్యను ఆలింగనం చేసుకున్నారు. దీనిని బట్టే వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అన్నది క్లారిటీ వచ్చేసింది.
అలాగే రవితేజపై వచ్చిన డ్రగ్స్ కేసు విషయాన్ని కూడా ప్రస్తావించిన బాలయ్య ఫిట్‌నెస్‌కు, హెల్త్‌కు ఎంతో ప్రాధాన్యతనిచ్చే నీపై డ్రగ్స్ ఆరోప‌ణ‌లు ఎందుకు వ‌చ్చాయ‌ని కూడా ప్రశ్నించారు. మామూలుగా ఇదే ప్రశ్నను మరోలా కూడా అడగవచ్చు... కానీ బాలయ్య చాలా హుందాతనంతో వ్యవహరించి రవితేజ మనసు నొప్పించకుండా ఈ ప్రశ్న వేసినట్టు అర్థమవుతోంది.
ఇక బాలయ్య - రవితేజ మధ్య గొడవలు జరిగినట్టు పుకార్లు పుట్టించిన వాళ్ళు అప్ప‌ట్లో ఓ క‌ట్టు క‌థ అల్లేశారు. రవితేజతో భద్ర - బాలయ్యతో మహారధి సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరాజాస్మిన్ వల్లే వీరి మధ్య గొడవలు జరిగాయని రూమ‌ర్ క్రియేట్ చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే నిజ‌మని న‌మ్మిన అంద‌రికి బాల‌య్య - ర‌వితేజ క్లారిటీ ఇచ్చి వారి నోళ్ల‌కు తాళం వేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: