సామాన్యుడుతో విశాల్ ఖాతాలో మరో హిట్టు పడేలా ఉందే..!!

Purushottham Vinay
మాంచి యాక్షన్ సినిమాలతో తమిళ ఇంకా తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో విశాల్. ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ సినిమాలలో ''సామాన్యుడు" సినిమా ఒకటి. తూ.పా. శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి 'నాట్ ఏ కామన్ మ్యాన్' ట్యాగ్ లైన్. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. రిపబ్లిక్ డే సందర్బంగా 2022 జనవరి 26 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.''ఇక ఇందులో విశాల్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఖచ్చితంగా విశాల్ కి ఈసారి మంచి హిట్ పడేటట్లు స్పష్టమవుతుంది.ఇందులో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై అసామాన్యుడుగా మారిన ఓ సామాన్యుడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

భారీ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన పవర్ పాక్డ్ టీజర్ గా ఇది అలరిస్తోంది. 'సామాన్యుడు' ట్యాగ్ లైన్ కు తగ్గట్లుగానే ఇందులో హీరో విశాల్ కామన్ మ్యాన్ లా కనిపించడం లేదు.పూర్తిగా వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ డిజైన్ చేసినట్లు ఇందులో మనకు కనిపిస్తోంది.ముఖ్యంగా 'సామాన్యుడు' టీజర్ చివర్లో చూసినట్లయితే విశాల్ చేసే ఫైట్ పెద్ద హైలైట్ గా నిలిచింది. స్టంట్ కొరియోగ్రఫర్ రవి వర్మ సారధ్యంలో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.ఇక మ్యూజిక్ మెజీషియన్ యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కెవిన్ రాజ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించడం జరిగింది. అలాగే ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ వర్క్ చేశారు.టాలీవుడ్ లో ‘సామాన్యుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని.. కోలీవుడ్ లో ‘వీరమే వాగై సూదుం’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఇందులో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది.అలాగే యోగిబాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: