ఆ పని మూడు రోజులు చేశా... మొదటిరోజు చేతులు వణికాయి... కృతి శెట్టి..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సబాస్టియన్ హీరోయిన్ లుగా రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగ రాయ్, ఈ సినిమా నుండి  టీజర్,  ట్రైలర్ విడుదల చేసినప్పటి నుండి ఈ సినిమాపై జనాలలో అంచనాలు పెరిగాయి, అంతేనా ప్రేక్షకులకు అంచనాలు పెరగడానికి దానికి ప్రధాన కారణం,  ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు చూపించడం, అలాగే సాయి పల్లవి దేవదాసి పాత్రలో నటించడం, కృతి శెట్టి మోడ్రన్ అమ్మాయిల కనిపించడం ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా  విడుదలకు ముందే నుంచే ప్రేక్షకులను మంచి అంచనాలను కలగజేసింది. ఇలా మంచి అంచనాలతో ఈ సినిమా డిసెంబర్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదలయ్యింది, మంచి ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలకు తగినట్టు గానే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది, ప్రస్తుతం థియేటర్ ల దగ్గర ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు పోతుంది.


 ఇలా జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా గురించి ప్రతి శెట్టి కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలియజెసింది. కృతి శెట్టి మాట్లాడుతూ.. నాకు స్మోకింగ్ అంటే అస్సలు నచ్చదు, కానీ ఈ సినిమాలో పాత్ర కోసం అదే చాలెంజింగ్‌ గా  అనిపించింది, ఆ సన్నివేశాలు తీసేయొచ్చు అని దర్శకుడిని అడిగాను. అది కీర్తి నువ్వు కృతి తేడా ఉండాలి కదా, అని దర్శకుడు చెప్పాడు. ఆరోగ్య సేతు సిగరెట్లు తీసుకువచ్చారు, వాటిలో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లు తాగడం మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాను, మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి అని కృతి శెట్టి 'శ్యామ్ సింగ రాయ్'  సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: