రజినీ గెస్ట్ గా RRR ఈవెంట్..!

shami
జనవరి 7న రిలీజ్ అవుతున్న ట్రిపుల్ R మూవీ ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు చిత్రయూనిట్. బాలీవుడ్ లో ఇప్పటికే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ ఇచ్చేశారు. ఇక సౌత్ లో మిగతా భాషల్లో కూడా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా తమిళనాడులో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ క్రేజీగా జరుగనున్నాయి. ఆల్రెడీ అంతకుముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా డిసెంబర్ 27న rrr ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరుగుతుందని తెలుస్తుంది. చెన్నై ట్రేడ్ సెంటర్ లో భారీగా ఈ ఈవెంట్ ప్లాన్ చేశారట.

ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తున్నారని టాక్. తమిళ హీరోలు చేసే ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తారు. ఇక్కడ మన హీరోలకు ధీటుగా తమిళ హీరోల సినిమాలు ఆడుతాయి. అయితే తమిళంలో ఆ పరిస్థితి లేదు. ఏవో కొద్ది సినిమాలు తప్ప అక్కడ సత్తా చాటింది తక్కువే. బాహుబలి ఆ మ్యాజిక్ క్రియేట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో అది రిపీట్ చేయాలని చూస్తున్నారు. తప్పకుండా rrr తమిళ ఆడియెన్స్ కు నచ్చుతుందని చెబుతున్నారు చిత్రయూనిట్.    

నేషనల్ వైడ్ గా rrr ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ విషయంలో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒమిక్రాన్ వల్ల ఇప్పటికే నార్త్ సైడ్ కొన్నిచోట్ల నైట్ కర్ఫ్యూ పెట్టారు. 50 శాతం ఆక్యుపెన్సీ కూడా కొనసాగుతుంది. ఈ టైం లో  RRR రిలీజ్ అయినా అనుకున్న టార్గెట్ మాత్రం రీచ్ అవడం కష్టం. ఏపీలో కూడా టికెట్ల రేట్లు.. థియేటర్ల మూసివేత పెద్ద ఇబ్బందిగా మారింది. మరి ఈ అవరోధాలు అన్ని తొలగించుకుని ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుందా లేక చివర్లో వాయిదా పడుతుందా అన్నది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: